Rana: పిలవకపోయిన వెళ్తావా..? రానాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

దగ్గుబాటి రానా ఇండస్ట్రీకి లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కాని ఎప్పుడైతే బాహుబలి సినిమాలో ప్రభాస్ కి విలన్ గా భళ్లాల దేవుడి క్యారెక్టర్ లో నటించారరో అప్పటినుండి ఈయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఓవైపు హీరోగా చేస్తుంటే మరోవైపు విలన్ గా కూడా రాణిస్తున్నాడు. రానా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ గా చేసి అందర్నీ తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్యకాలంలో రానా వెంకటేష్ కలిసి చేసినా రానా నాయుడు వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఎంతమంది ప్రేక్షకులు దీన్ని ఆదరించారో అంతే మంది ప్రేక్షకులు దీన్ని విమర్శించారు కూడా.ఎందుకంటే ఇందులో ఎన్నో శృంగార సన్నివేశాలు,బూతు డైలాగులు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఈ వెబ్ సిరీస్ ని వ్యతిరేకించారు.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రానా తాజాగా పరేషాన్ మూవీ టీం తో కలిసి సుమా హోస్టుగా చేస్తున్న సుమ అడ్డ షోకి వచ్చారు. ఈ షో కి మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చారు.అయితే ఇందులో ఎంట్రీ ఇస్తూనే సుమాకి పంచులు విసిరారు రానా. అంతేకాకుండా ఈ షో మొత్తం నవ్వులు పూయించాడు. అంతేకాకుండా సుమ రానా ని ఇండస్ట్రీలో మందు పార్టీ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా..

అని ప్రశ్నించగా దానికి రానా (Rana) సమాధానం ఇస్తూ..హ ఉన్నారు అలా పార్టీ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్లది ఒక పెద్ద బ్యాచే ఉంది.అందులో ఆ బ్యాచ్ కి నేనే హెడ్ ని అంటూ రానా అందరికీ షాక్ ఇచ్చారు. ఇక రానా మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. కానీ ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఏంటి రానా మరీ ఎంత తాగుబోతా..తాగుడు ఉంది అంటే పార్టీకి పిలవకుండా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus