Aishwarya Rai: ఐశ్వర్యా రాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఐశ్వర్యా రాయ్ పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాల తర్వాత పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఐశ్వర్యా రాయ్ వయస్సు 50 సంవత్సరాలు కాగా ఆమె ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే ఐశ్వర్యారాయ్ ఎక్కువ సినిమాలలో నటించకపోవడం ఆమె వీరాభిమానులను బాధ పెడుతోంది. నువ్వు ఇంట్లో కూర్చుని కెరీర్ ను నాశనం చేసుకుంటున్నావ్ అంటూ ఐశ్వర్యా రాయ్ గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేయగా ఆ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఐశ్వర్యా రాయ్ కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ మెజారిటీ నెటిజన్ల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ఐశ్వర్యా రాయ్ గురించి నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తిని ఇతర ఫ్యాన్స్ మాత్రం విమర్శిస్తున్నారు. కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఐశ్వర్యా రాయ్ ఇష్టమని ఆమె గురించి ఇష్టానుసారం కామెంట్లు చేయడం సరికాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ గురించి ఐశ్వర్యా రాయ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఫోటోలను సైతం ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆరాధ్య కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఆరాధ్యకు సినిమాలపై ఆసక్తి ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఆరాధ్య బచ్చన్ తల్లిలా అందంగా ఉన్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆరాధ్య బచ్చన్ సినిమాల్లోకి వస్తే మాత్రం తల్లిలా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐశ్వర్యా రాయ్ కు ప్రముఖ దర్శకుల నుంచి ఆఫర్లు అయితే వస్తున్నాయని తెలుస్తోంది. ఆమె రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus