Anushka: అనుష్క గురించి అభిమానులు అలాంటి కామెంట్లు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క వయస్సు పెరుగుతున్నా ఆమెకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా మరికొన్ని నెలల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అనుష్క సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో అనుష్క (Anushka) లేటెస్ట్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అనుష్క ఒకింత బొద్దుగా కనిపిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ లో అనుష్క వైట్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో అనుష్క అందంగా కనిపిస్తున్నా కొంచెం బొద్దుగా ఉన్నారు. అయితే అనుష్క బొద్దుగా కనిపించడంపై ఫ్యాన్స్ స్పందిస్తూ బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా దేవత దేవతనే అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరగగా ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఆమె బరువు తగ్గడానికి ప్రయత్నించినా బరువు తగ్గలేదు. థైరాయిడ్ సమస్య వల్ల అనుష్క ఇబ్బంది పడ్డారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియవు. అయితే అనుష్క వరుస సినిమాలలో నటిస్తే మాత్రం ఫ్యాన్స్ కచ్చితంగా సంతోషిస్తారు. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లపై అనుష్క దృష్టి పెడితే మంచిది.

హర్రర్ థ్రిల్లర్ జానర్ లో అనుష్క నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ జానర్ ఆమెకు అచ్చొచ్చిన జానర్ అని కూడా చెప్పవచ్చు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ కు మరో పదేళ్ల పాటు ఢోకా లేదని కొంతమంది చెబుతున్నారు. ఈ కామెంట్ల విషయంలో అనుష్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus