Suguna Sundari: బాలయ్య డాన్స్ పై నెటిజన్ల కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

బాలయ్య, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ మరో నాలుగు వారాల తర్వాత థియేటర్లలో రిలీజ్ కానుంది. జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ బాలయ్యకు ఊపు వస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సుగుణ సుందరి పాటలోని బాలయ్య స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

62 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య ఎన్జరీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డ్యాన్స్ విషయంలో బాలయ్య యంగ్ జనరేషన్ స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు బాలయ్యపై అభిమానం పెరిగిపోతుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సిన ఎనర్జీ జై బాలయ్య అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా అఖండను మించిన విజయాన్ని అందుకోవాలని ఇతర హీరోల అభిమానులు సైతం కోరుకుంటున్నారు. బాలయ్య ఎనర్జీ అన్ స్టాపబుల్ అని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్యను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్పులు కూడా అదే విధంగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బాలయ్య థమన్ కాంబినేషన్ ప్రేక్షకులను అస్సలు నిరుత్సాహపరచదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సాంగ్ వింటుంటే సమరసింహారెడ్డి పాటలు గుర్తుకు వస్తున్నాయని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు అభిమానులం అయినందుకు గర్వపడుతున్నామని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus