‘బిగ్‌బాస్‌’ ఫ్యాన్స్‌ రచ్చ… సోషల్‌ మీడియాలో ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు

ఏ పోటీ అయినా ఇద్దరు ఉంటారు. ఒకరు విన్నర్‌ అయితే, మరొకరు రన్నర్‌. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే విన్నర్‌ అని అనేస్తుంటారు. అయితే రన్నర్‌ కూడా ఫైనల్‌ వరకు వచ్చాడు కదా అతను/ ఆమె కూడా గ్రేట్‌. అంతేకాదు ఆడినవాళ్లకు లేని ఇబ్బంది, ఓడినవాళ్లకు లేని బాధ బయటి జనాలకు ఎందుకు? ఇదేంటి ఇంత నీతి వాక్యాలు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ విషయం మరచిపోయిన కొందరు ఏకంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు కాబట్టి.

గతంలో రాజకీయాల్లో ఓడిపోయిన పార్టీ కార్యకర్తలు గెలిచిన పార్టీ నాయకుడికి చెందిన వారి మీద తమ ఆగ్రహం చూపించేవారు. అయితే ఇది కొంతమంది పుణ్యమా అని రియాలిటీ షోలకు కూడా వచ్చేసింది. స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న ‘బిగ్‌బాస్‌’ గురించే ఇదంతా అని మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. గతంలో ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఎక్కడో ఊరు చివరన స్టూడియోలో పెట్టేవారు. అదెక్కడ అనేది కూడా మనవాళ్లకు తెలిసేది కాదు.

అయితే తర్వాత తర్వాత హైదరబాద్‌లోనే పెట్టేస్తున్నారు. దీంతో ఎలిమినేషన్లు, విన్నర్ల విషయంలో అతని అభిమానులు అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు రోడ్లెక్కి నానా రచ్చ చేస్తున్నారు. రన్నర్‌, కంటెస్టెంట్‌, ఇంటర్వ్యూయర్‌ అనే తేడా లేకుండా అందరి కార్ల అద్దాలు పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా ‘ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలకొట్టారు’ అని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో జనాల మధ్య ఎందుకిలా అడవిలోకి పోయి చేసుకోండి అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అభిమానం మనసులో ఉంటుంది, తమ అభిమాన వ్యక్తుల ఎదుట బయటకు వస్తుంది. అంతేకానీ ఇలా జనాల మీద, వాళ్ల ఆస్తుల మీద చూపించడం సరికాదు అని సగటు ప్రజలు అంటున్నారు. గతంలో ఓ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌ మీద అభిమానం చూపించి ‘బిగ్‌బాస్‌’కి కొత్త రంగు చూపించారు కొంతమంది. కానీ ఈసారి ఏకంగా అభ్యంతరకర రీతిలో ఇలా చేశారు. మరి ఈ విషయంలో (Bigg Boss) బిగ్‌బాస్‌ యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus