Jabardasth: జబర్దస్త్ కమెడియన్ పైర్ అవుతున్న నెటిజన్లు!

  • November 21, 2023 / 04:04 PM IST

ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ మన టాలీవుడ్ అని చెప్పాలి. ప్రతి సినిమాలో ఏదో ఒక రకంగా కామెడీ చేస్తుంటారు. అలాగే మన బుల్లి తెరలో కూడా అనేక ఎంటర్టైన్మెంట్ షోలు నడుస్తున్నాయి. వాటి లో ఫస్ట్, సెకండ్ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఉంటాయని చెప్పడంలో ఏటువంటి సందేహం లేదు.. కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది జీవితాన్ని పొందారు. ఈ షోతో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా పాపులర్ అయ్యారు.

అయితే ఇటీవల కాలంలో అట్రాక్షన్ కోసం జనాలను ఆకర్షించడానికి కంటెస్టెంట్లకు మధ్య కాంట్రవర్సీలు, లవ్ ట్రాకులు ఇలా ఏదో ఒక క్లిప్‌ ను కట్ చేసి ప్రేక్షకులకు షోపై హైప్‌ పెంచేందుకు చూస్తుంటారు. ఇక ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. బేబీ సినిమా హీరో వీరాజ్‌ అశ్విన్ ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దీంతో కమెడియన్ ఆయనను అడగరాని ప్రశ్న అడిగాడు.

తాజాగా ఈ షోలో ఓ కమెడియన్ చేసిన పనికి విరాజ్ తో పాటు జడ్జిలు, యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ ఓ ప్రశ్న అడిగాడు. ఎలాగూ వచ్చారు కదా వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ గంట వీడియో ఉందా అది ఉంటే ఫార్వర్డ్ చేయండి అంటూ అడిగాడు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక విరాజ్ కిమ్మనక ఉండిపోయాడు. ఇక అక్కడే ఉన్న జడ్జిలు కుష్బూ, కృష్ణ భగవాన్ తో పాటు యాంకర్ రష్మీ కూడా కంగుతింది.

ఇప్పటికే కామెడీ పేరుతో చాలాసార్లు (Jabardasth) ఈ షోలో కంటెస్టెంట్లు హద్దు దాటిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఇటీవల కాలంలో కామెడీకి హద్దు లేకుండా పోతుంది. మితిమీరిన డైలాగ్లు వేస్తూ చీఫ్ ప్రశ్నలు అడుగుతూ ఆ షోకు ఉన్న రేపిటేషన్ ను పోగొట్టుకుంటున్నారు అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus