UV Creations: పక్కా ప్లానింగ్‌ లేకుండా మాటలు పడ్డ ప్రభాస్‌ టీమ్!

చెప్పిన సమయానికి ఆ పని చేయని వారిని ఏమంటారు? బయట ఏమంటారో తెలియదు కానీ… టాలీవుడ్‌లో మాత్రం యూవీ క్రియేషన్స్‌ అంటారు. ఈ మాట మేం అనడం లేదు. నెటిజన్లే ఈ మాట చెబుతున్నారు. దానికి తాజా కారణం ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌ సింగిల్‌. ‘ఈ రాతలే..’ అంటూ ఓ పాటను చిత్రబృందం సోమవారం రాత్రి విడుదల చేసింది. అయితే అనుకున్న సమయం కంటే జస్ట్‌ రెండున్నర గంటల ఆలస్యంగా ఈ పాట వచ్చింది. ఇంకేముంది నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు.

ఈ పాటను రాత్రి 7 గంటల ప్రాంతంలో విడుదల చేస్తామని గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. దీంతో సినిమా కోసం, సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లైక్‌లు కొట్టడానికి రెడీ అయ్యారు. మీమ్స్‌ వేసుకుందామని ఫిక్స్‌ అయినవాళ్లు కూడా అదే పనిలో ఉన్నారు. అయితే పాట విడుదల వాయిదా పడుతూ, పడుతూ ఆఖరికి 9.15 తర్వాత వచ్చింది. దీంతో మీమర్స్‌ పండగ చేసుకున్నారు.

యూవీ క్రియేషన్స్‌ అంటే ఆలస్యం అనే మరో అర్థం ఉంది అంటూ కామెంట్లు చేశారు. సినిమా విడుదలలోనే ఆలస్యం అనుకుంటే… ఇప్పుడు పాటల విడుదలలోనూ అంతేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. గంట, గంట అంటూ ఎన్ని గంటలు అని విసుక్కున్న వాళ్లూ ఉన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల పాట విడుదల ఆలస్యమైందని చిత్రబృందం చెప్పింది. కానీ పాట వచ్చాక మాత్రం అదిరిపోయింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus