Anirudh Ravichander: రెమ్యునరేషన్ పెంచి క్వాలిటీ తగ్గించిన అనిరుధ్.. వీక్ వర్క్ అంటూ?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో అనిరుధ్ కు (Anirudh Ravichander) మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఇండియన్2 (Bharateeyudu 2)  సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా మ్యూజిక్, బీజీఎంతో మెప్పించలేకపోయారు. అనిరుధ్ కెరీర్ లో వీక్ సినిమా ఇండియన్2 అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం. అయితే రెమ్యునరేషన్ ను పెంచేసిన అనిరుధ్ క్వాలిటీని మాత్రం పట్టించుకోవడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శంకర్ సినిమాలకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ విషయంలో ప్రతి సందర్భంలో పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే అనిరుధ్ మాత్రం శంకర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అనిరుధ్ ఇతర భాషల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా రాబోయే రోజుల్లో అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

అనిరుధ్ నెగిటివ్ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అనిరుధ్ ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లకు సంబంధించి కూడా జవాబు దొరకాల్సి ఉంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన దేవర సినిమా సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయని భోగట్టా.

ఇప్పటికే విడుదలైన ఒక సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా త్వరలో దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా అనిరుధ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. అనిరుధ్ మ్యూజిక్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. తప్పులు రిపీట్ చేస్తే అనిరుధ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus