టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరు కాగా ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మరికొన్ని రోజుల్లో కల్కి సినిమాతో ఈ దర్శకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కల్కి సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం 10 లక్షల రూపాయల చిన్న కారులో తిరుగుతుండగా ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చెస్తున్నారు. నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు చాలా తక్కువమంది ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు. కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్ కాన్ఫిడెన్స్ తో ఉండగా ఈ సినిమా ట్రైలర్ కూడా కొత్తగా ఉందనే సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఆలోచనా శక్తితో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కల్కి ట్రైలర్ హిందీ వెర్షన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. కల్కి సినిమాలో రెండు సాంగ్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది. మరికొన్ని రోజుల్లో ముంబై, చెన్నైలలో ఈ సినిమా ఈవెంట్లు జరగబోతున్నాయని తెలుస్తోంది. అమరావతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి.
కల్కి సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి రిలీజ్ కానున్న మరో ట్రైలర్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.