Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Reviews » Harom Hara Review in Telugu: హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!

Harom Hara Review in Telugu: హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 14, 2024 / 01:34 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Harom Hara Review in Telugu: హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • మాళవిక శర్మ (Heroine)
  • సునీల్ , జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు.. (Cast)
  • జ్ణానసాగర్ ద్వారక (Director)
  • సుమంత్ జి.నాయుడు (Producer)
  • చేతన్ భరద్వాజ్ (Music)
  • అరవింద్ విశ్వనాధన్ (Cinematography)
  • Release Date : జూన్ 14, 2024
  • శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ (Banner)

సుధీర్ బాబు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త యాస, బాడీ లాంగ్వేజ్ తో “హరోం హర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు సుబ్రమణ్యంగా వచ్చాడు. చిత్తూరు యాసలో సుధీర్ బాబు డైలాగులు, ఎలివేషన్ షాట్స్ తో టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మరి సినిమాగా “హరోం హర” ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: కుప్పంలోని ఓ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు). తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం కష్టపడాలని డిసైడ్ అయ్యి తుపాకులను తయారు చేయడం మొదలెడతాడు. దాంతో సౌత్ ఇండియాలో పెద్ద డాన్ అయిపోతాడు. సుబ్రమణ్యం స్థాయి కుప్పం నుండి ముంబై చేరడానికి కారకులు ఎవరు? ఈ క్రమంలో అతను ఎంతమందిని ఎదిరించాల్సి వచ్చింది? ఏ విధంగా నిలదొక్కుకోగలిగాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “హరోం హర” చిత్రం.

నటీనటుల పనితీరు: సుధీర్ బాబు కెరీర్లో ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ది బెస్ట్ గా “సుబ్రమణ్యం” పాత్రను చెప్పుకోవచ్చు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఇంకాస్త బాగా పెర్ఫార్మ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చిత్తూరు యాసలో మాత్రం సంభాషణలు అదరగొట్టేశాడు. అలాగే.. ఫైట్ సీన్స్ లోనూ తన బాడీ లాంగ్వేజ్ తో అలరించాడు. సునీల్ కి మంచి పాత్ర లభించింది. పళని అనే పాత్రలో సపోర్టింగ్ రోల్లో సునీల్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక సినిమాలో లెక్కకుమిక్కిలి ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: చేతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. కేజీఎఫ్, విక్రమ్ రేంజ్ లో బీజీయమ్ ఇచ్చాడు. అసలు కొన్ని ఎమోషన్స్ & సీన్స్ కి ఇచ్చిన మ్యూజికల్ ఎలివేషన్ అదిరిపోయింది. అరవింద్ విశ్వనాధన్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అదే స్థాయిలో ఉంది. అసలు అంత మినిమమ్ బడ్జెట్ లో ఈ స్థాయిలో క్వాలిటీ ఎలా సాధించారు అనేది పెద్ద ప్రశ్న.

ఇక దర్శకుడు జ్ణానసాగర్ ద్వారకా రాసుకున్న కథ, కథనం, ట్విస్టులు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. మరి సుధీర్ బాబులో మహేష్ బాబుని చూసుకున్నాడో ఏమో కానీ.. ఇంటర్వెల్ బ్యాంగ్ & మార్కెట్ ఫైట్ లో ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. ఈమధ్యకాలంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల్లో ది బెస్ట్ ఎలివేషన్స్ “హరోం హర”లో ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడిగా, కథకుడిగా తన బెస్ట్ ఇచ్చాడు జ్ణానసాగర్.

విశ్లేషణ: మాస్ మసాలా మూవీ లవర్స్ కి మంచి విందు భోజనం లాంటి చిత్రం “హరోం హర”. కథనం & క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అయినప్పటికీ.. మాస్ ఎలివేషన్స్, చేతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం, జ్ణానసాగర్ టేకింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: ఈ సినిమా సుధీర్ బాబుకి జ్ణానసాగర్ ఇచ్చిన కేజీఫ్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gnanasagar Dwaraka
  • #Harom Hara
  • #Malvika Sharma
  • #Sudheer Babu
  • #Sunil

Reviews

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

trending news

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

53 mins ago
Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

1 hour ago
Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

2 hours ago
The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

18 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

18 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

14 hours ago
Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

14 hours ago
Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

15 hours ago
Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

15 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version