Kalki: ప్రాజెక్ట్ కే రూ.3000 కోట్ల బొమ్మ అవుతుందా.. అన్ని భాషల్లో రిలీజ్ కానుందా?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన నాగ్ అశ్విన్ పదేళ్లలో మూడు సినిమాలను మాత్రమే తెరకెక్కించినా ఇప్పటికే విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు ప్రేక్షకుల్ అంచనాలను మించి మెప్పించాయి. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి. నాగ్ అశ్విన్ మూడో సినిమాగా ఏకంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కే రూ.3000 కోట్ల బొమ్మ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కానన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. విదేశీ భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండగా పది కంటే ఎక్కువ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కావడంతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ల ఖ్యాతిని మరింత పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు సౌత్ నుంచి రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తీసి భాషతో సంబంధం లేకుండా ప్రశంసలను పొందుతున్నారు. అయితే నాగ్ అశ్విన్ మరో రాజమౌళి అవుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పోస్టర్ తో నిరాశపరిచిన నాగ్ అశ్విన్ గ్లింప్స్ తో మాత్రం అంచనాలను పెంచేశారు. 2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే మూవీ విడుదలవుతుందో లేక మరో డేట్ కు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.

ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అందుకు సంబంధించి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ పని చేస్తున్నారని తెలుస్తోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus