Kalki 2898 AD , Indian 2: ‘కల్కి 2898 AD’..ని తెలుగు జనాలు చాలా సీరియస్ గా తీసుకున్నారట..!

  • June 22, 2024 / 07:25 PM IST

‘పొన్నియన్ సెల్వన్ -1’ అదే ‘పీఎస్ -1’ రిలీజ్ అయినప్పుడు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. ‘బాహుబలి’ (Baahubali)  చూసిన కళ్ళతో ఆ సినిమాని చూడలేకపోయారు తెలుగు ప్రేక్షకులు. వాస్తవానికి ‘బాహుబలి’ వంటి కథ స్ఫూర్తి పొందింది ‘పొన్నియన్ సెల్వన్’ నుండే..! ఈ సినిమా తీయడానికి 4 దశాబ్దాలు కష్టపడ్డాడు దర్శకుడు మణిరత్నం (Mani Ratnam). కానీ మొదటి భాగంలో లెక్కలేనన్ని పాత్రలు.. వాటి స్వభావాలు తెలుగు జనాలకి ఎక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో ‘పీఎస్ 1 ‘ పై విమర్శలు గుప్పించారు.

ఇది తమిళ జనాలని, అక్కడి క్రిటిక్స్ ని హర్ట్ చేసింది. ‘తెలుగు ప్రేక్షకులకి సినిమా చూడటం రాదు’ అన్నట్టు వారు కామెంట్లు చేశారు. కానీ తమిళ హీరోల సినిమాలను అక్కడి జనాల కంటే ఎక్కువగా ఆదరించేది మనవాళ్లే..! ఈ విషయాన్ని స్వయంగా తమిళ హీరోలే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో రూపొందిన పాన్ ఇండియా సినిమాల్లో ఒక్క ‘పుష్ప’ (Pushpa) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)..లను తప్ప మరో సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించింది లేదు.

ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) సినిమాలను అక్కడి జనాలు ఆదరించడం లేదు. అతని ఎదుగుదలకు కూడా తమిళ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్ ..ఓర్చుకోలేకపోతున్నట్టు మొన్నామధ్య టాక్ కూడా నడిచింది. కానీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమా విషయంలో తెలుగు సినీ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతుంది.

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా నటించిన ‘కల్కి..’ చిత్రం కనుక తమిళంలో ఆడకపోతే, ఆ తర్వాత రిలీజ్ అయ్యే ‘ఇండియన్ 2 ‘ (Indian 2) ని అదే ‘భారతీయుడు 2’ ని మేము చూడమంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus