Sukumar: సుకుమార్ ఆ విషయంలో మారక తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా, బ్రిలియంట్ డైరెక్టర్ గా సుకుమార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలతో సుకుమార్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. తను అనుకున్న సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించే దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు కావడం గమనార్హం. సుకుమార్ త్వరలో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. అయితే తాజాగా జరిగిన అంటే సుందరానికి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు.

అయితే సుకుమార్ భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలో పవన్ ను కలిశానని ఆ సమయంలో తాను ఆయాసపడుతూ కనిపించానని తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని భావించి త్రివిక్రమ్ ను పవన్ తన దగ్గరకు పంపారని తెలిపారు. తాను పవన్ ను చూసిన ఆనందంలోనే ఆయాసపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యోగా చేయడం ద్వారా ఆయాసం సమస్యను అధిగమించానని సుకుమార్ అన్నారు. అయితే సుకుమార్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం

సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రకు కూడా తక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సుకుమార్ హెల్త్ పై ప్రభావం పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ హెల్త్ విషయంలో మారితే మంచిదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని సుకుమార్ ఇకనైనా మారతారో లేదో చూడాల్సి ఉంది. సుకుమార్ వయస్సు 52 సంవత్సరాలు కాగా ఆయన చూడటానికి తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిగానే కనిపిస్తారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus