Varsha: జబర్దస్త్ వర్షపై నెటిజన్ల ట్రోల్స్.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వర్ష హవా ఈ మధ్య కాలంలో కొంతమేర తగ్గింది. సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన వర్ష జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. వర్షపై జబర్దస్త్ షోలో వేసే పంచ్ లపై ప్రేక్షకుల్లో భిన్నా భిప్రాయాలు ఉన్నాయి. అయితే వర్ష తాజాగా సోషల్ మీడియాలో నిశ్చితార్థం అని చెప్పడంతో ఇలా రెడీ ఆయ్యానంటూ కామెంట్లు చేశారు. వర్ష వీడియో థంబ్ నైల్ చూసిన చాలామంది వర్షకు పెళ్లి కుదిరేందేమో అని అనుకున్నారు.

అయితే ఆ తర్వాత వీడియోలో వర్ష రాకేశ్ సుజాతల నిశ్చితార్థానికి హాజరయ్యానని కామెంట్లు చేశారు. అయితే వీడియోల లైక్స్, వ్యూస్ కోసం వర్ష ఇలా దిగజారాలా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ తరహా ప్రవర్తన వల్లే సెలబ్రిటీలపై నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి వర్ష ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు జబర్దస్త్ షోలో వర్షను మగాడు మగాడు అంటూ బాడీ షేమింగ్ చేస్తున్న కామెంట్ల గురించి

భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వర్షకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా యూట్యూబ్ లో వర్ష వీడియోలకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. జబర్దస్త్ వర్షకు సినిమాలలో ఆఫర్లు వస్తున్నా ఆమె ఆ ఆఫర్లకు ఓకే చెప్పడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే సినిమాలలో నటించాలని వర్ష భావిస్తుండటం గమనార్హం.

జబర్దస్త్ వర్ష మారాల్సిన అవసరం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ వర్ష వయస్సు 26 సంవత్సరాలు కాగా ఈమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. వర్ష కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus