హీరోతో ఫొటో తీసి షేర్ చేసి ట్రోలింగ్ గురవ్వడం ఎప్పుడైనా చూశారా? అయితే ఓసారి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూడండి. అందులో తారక్‌తో (Jr NTR) ఆమె దిగిన ఫొటో కింద కామెంట్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఫొటోతో రైటప్ ఏమన్నా తప్పు పెట్టిందా? అనౌ డౌట్ అస్సలు వద్దు. ఎందుకంటే అభిమానులకు నచ్చేలానే రాసింది. కానీ ఆ ఫొటో తీసిన విధానమే సరిగ్గా లేదు. నూబ్ నెటిజన్ల తరహాలో ఫిల్టర్ వాడి సెల్ఫీ దిగడమే ఆమె ట్రోల్‌కు గురవ్వడానికి కారణం.
ఊర్వశి రౌటేలా ఎప్పటి మనిషో. పదేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చింది. తెలుగు సినిమాల్లో ఛాన్స్‌లు కోసం కొన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. అయితే ఇటీవల కాలంలో ఐటెమ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెప్పించింది కూడా. అలాంటి ఆమె ముంబయిలోని ఓ జిమ్‌లో తారక్‌ను కలిసింది. సెల్ఫీ అడిగి తీసుకొని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నవ్వులపాలైంది. దానికి కారణం యంగ్‌గా కనిపించడానికి ఆమె పెట్టిన కెమెరా ఫిల్టర్.
ఊర్వశి పోస్ట్ చేసిన సెల్ఫీతో ఎన్టీఆర్ ‘వార్ 2’ లుక్ బయటకు వచ్చేసింది అని అభిమానులు ఆనందపడుతున్న సమయంలో… అసలు అది ఒరిజినల్ పిక్ కాదని, ఫిల్టర్ పెట్టి మొత్తం ముఖాన్ని గుర్తుపట్టలేకుండా చేసేసింది అని నెటిజన్లు గుర్తించారు. మొన్నటికి మొన్న యశ్‌రాజ్ స్టూడియో ముందు తారక్ ఇలా లేడు కదా… ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకున్నారు. అయితే కాసేపటికి ఫిల్టర్ వాడటం వల్ల తారక్ అలా మారాడని, సారీ చెప్పింది ఊర్వశి.
అయితే సెల్ఫీల్లో ఊర్వశి యంగ్ లుక్ వెనుక అసలు కథ ఇదా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఫిల్టర్లు వాడలేదని, ఆ ఫొటో చైనా ఫోన్‌తో తీసింది అని చెప్పింది. అయితే ఐఫోన్ వాడే ఆమె చేతికి చైనా ఫోన్ ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అనే ప్రశ్నలు మళ్లీ వచ్చాయి.