Vijay Thalapathy: ‘భారతీయుడు 2’ కి ప్లాప్ టాక్.. విజయ్ పై ట్రోలింగ్ షురూ.!

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ట్రోల్స్ అనేవి సర్వసాధారణం. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా ఇలాంటివి మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. కానీ ఓ స్టార్ హీరో విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు విజయ్ (Vijay Thalapathy) . ఉదాహరణకి ఐపీయల్లో చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీం ఓడిపోయినా, లేదంటే ఇండియా ఏదైనా జట్టుపై ఓడిపోయినా.. ఎందుకో కొంతమంది పనిగట్టుకుని తమిళ స్టార్ హీరో విజయ్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇందులో ఎక్కువ శాతం మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ ఉండటం గమనార్హం. విజయ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య ఎందుకో ట్వీట్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. విజయ్ కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మహేష్ బాబుకి తమిళంలో ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ నటించిన ‘ఒక్కడు’ (Okkadu) ‘పోకిరి’ వంటి సూపర్ హిట్ సినిమాలు విజయ్ రీమేక్ చేయడం జరిగింది. ఆ సినిమాల క్లిప్పింగ్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మళ్ళీ విజయ్ ని టార్గెట్ చేశారు కొంతమంది నెటిజెన్లు. విజయ్ తో ‘నన్బన్'(తెలుగులో స్నేహితుడు)  (Nanban) సినిమా చేసినప్పటి నుండి దర్శకుడు శంకర్ కి శని పట్టుకుందట. అప్పటి నుండి శంకర్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు అంటూ విజయ్ ని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజెన్లు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus