సోషల్ మీడియా వచ్చాక ప్రతీ వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది. అలాగే వారి సందేశాలు కూడా డైరెక్ట్ గా సెలేబ్రిటిలకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీల పై సామాన్యుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. వారి ప్రతీ కథలిక కు గమనిస్తూ ఉంటారు. ఏమాత్రం వారికి తేడాగా అనిపించినా ఏమాత్రం ఆలోచించకుండా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు అనడంలో సందేహమే అవసరం లేదు. చాలా మంది సెలెబ్రిటీలు ఇలా ట్రోలింగ్ కు గురయ్యారు. ఇందుకోసం సెలెబ్రిటీలు చాలా జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. అయితే అనుకోకుండా ఇప్పుడు నాగార్జున, రవితేజ నెటిజెన్లకి అడ్డంగా బుక్కై పోయారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుగురు టాలీవుడ్ హీరోలు ట్వీట్లు చేసారు. ఇందులో నాగార్జున, రవితేజ కూడా ఉన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్’ అద్భుతమంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతూ తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు పేరుని మాత్రం వీరు ప్రస్తావించలేదు. దీంతో వీరి పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ” ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ పూర్తి కావడంలో హరీశ్ రావు పాత్ర చాలా ముఖ్యమైంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఎంతో శ్రమించారు. చెప్పాలంటే.. ఆయనకే.. క్రెడిట్ అంతా దక్కుతుంది… అంటూ రవితేజ ట్వీట్‌కు చేశారు. మరికొందరైతే ‘మీ డ్రగ్స్ కేస్ క్లోజ్ అయ్యిందా?’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ‘క్రెడిట్ హరీశ్‌రావుకు కాకుండా కె.టి.ఆర్‌కు ఇవ్వడం కరెక్ట్ కాదు’ అంటూ నాగార్జున పై కూడా మండిపడ్డారు.