Sreeleela: లిప్ కిస్ విషయంలో శ్రీ లీలను ఆడుకుంటున్న నెటిజన్స్!

నటి శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయారు. ఈమె చేతిలో వరుస సినిమా అవకాశాలను పెట్టుకొని మరోవైపు వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీ లీల నవంబర్ 10వ తేదీ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ లీల కూడా వరుస సినిమా షూటింగ్ పనులతో పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అలాగే సక్సెస్ మీట్ కార్యక్రమాలు అంటూ ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమెకు లిప్ లాక్ సీన్ గురించి ఒక ప్రశ్న ఎదురవడంతో ఈమె చెప్పిన సమాధానం భారీగా వైరల్ అయింది.

మీరు కనుక లిప్ లాక్ చేయాల్సి వస్తే మొదట ఏ హీరోతో చేస్తారు అంటూ ఈమెకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీ లీల సమాధానం చెబుతూ నేను ఏ హీరోకి లిప్ లాక్ ఇవ్వను ఒకవేళ లిప్ కిస్ కనుక ఇస్తే అది నా భర్తకే అంటూ ఈమె సమాధానం చెప్పుకొచ్చారు. అయితే శ్రీ లీల చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ కావడంతో కొంతమంది నేటిజన్స్ ఈమె గతంలో నటించిన సినిమాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి (Sreeleela) శ్రీ లీల అప్పటికే కన్నడలో కిస్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈమె హీరోతో కలిసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. ఇందులో భాగంగా లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో నెటిజెన్స్ షేర్ చేస్తూ ఎవరికీ లిప్ కిస్ ఇవ్వను నా మొదటి ముద్దు భర్తకే అని చెప్పావు మరి ఇదేంటి శ్రీలీలా అంటూ భారీగా ఈమె పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus