Allu Arjun: ఫస్ట్‌ లుక్‌కే ప్రీ రిలీజ్‌ ఈవెంటా… అంటున్న నెటిజన్లు

సినిమా ప్రచారం అంటే ఒకప్పుడు పోస్టర్‌ లాంచ్‌, టీజర్‌/ట్రైలర్ లాంచ్‌ లాంటివి జరిగేవి. అయితే ఇవన్నీ ప్రెస్‌మీట్ రూపంలో అయ్యేవి. సినిమా విడుదలకు ఓ నెల రోజుల ముందు ఆడియో రిలీజ్‌ జరిగేది. ఆ తర్వాత హీరో, దర్శకుడు, హీరోయిన్‌ ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. క్యాసెట్లు, సీడీలు పోయాక… ఇప్పుడు ఆడియో రిలీజ్‌ స్థానంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు వచ్చాయి. ఇక సినిమా రిలీజ్‌ అయ్యాక జరిగే అభినందన సభ, థ్యాంక్స్‌ మీట్‌, సక్సెస్‌ మీట్‌ ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే పోస్టర్‌ లాంచ్‌నే… ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా చేస్తే… దానిని ఏమనాలి. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాదు కాదు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రచారం అనాలి.

మొన్నీమధ్య అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దానికి చిత్రబృందం ఏం పేరు పెట్టినా అది టీజరే. ఎందుకంటే అప్పటికే బన్నీ ఆ సినిమాలో ఎలా ఉంటాడో పోస్టర్లలో చూపించేశారు కాబట్టి. ఇక్కడిదాకా ఓకే. ఆ ఈవెంట్‌ జరిగిన విధానమే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అవుతోంది. నిజానికి ఈ మాట ఈవెంట్‌ అనౌన్స్‌మెంట్‌ నుండే వచ్చింది. కానీ ఆ వేడిలో ఎందుకు అని ఇప్పుడు చర్చకు తీసుకొచ్చాం. ఓ టీజర్‌ లాంచ్‌కి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అంత భారీ సెట్‌, ఎలివేషన్‌ అవసరమా? అనేది నెటిజన్ల ప్రశ్న.

‘పుష్ప’ సినిమా చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలన్స్‌ ఉంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా అసలు టైమ్‌కి వస్తుందా లేదా అనే డౌట్‌ కూడా ఉంది. ‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్న చందంగా అప్పుడే సినిమా ప్రచారం ఎందుకు? ఈ డౌటానుమానం చాలామందికి వచ్చింది. ఈవెంట్‌ జరిగిన స్టయిల్‌ చూస్తే… అభిమానులను ఖుషీ చేయడానికో, లుక్‌ కోసమో ఈవెంట్ పెట్టినట్లుగా లేదు. ఐకాన్‌ స్టార్‌ అనే నామకరణం కోసమే జరిగినట్లు ఉంది. అంత అర్జెంట్‌గా బిరుదు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో బన్నీకి తెలియడం లేదు.

మరోవైపు ఈ మధ్య అల్లు అర్జున్‌కు ప్రచార యావ ఎక్కువైపోయిందనే సన్నాయి నొక్కులూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదోలా ఎప్పుడూ మీడియాలో ఉండటానికి ఇష్టపడుతున్నాడనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. సినిమా ప్రచారం మొదలవ్వడానికి ఇంకా చాలా సమయం ఉన్నా… ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఏదైతేముంది… సోషల్‌ మీడియాలో బన్నీ ఫ్యాన్స్‌ రెండు రోజులు సందడి చేసుకున్నారు. బన్నీ నువ్వే చెప్పేయొచ్చుగా ఎందుకు ఈ ప్రచారమో.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus