ఈరోజుల్లో ఓ పెద్ద సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడం అంటే పెద్ద టాస్క్ అయిపోయింది. 2021 ఎండింగ్లో ‘పుష్ప’ ని కిందా మీదా పడి విడుదల చేశారు. ఆ టైములో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో దానికి బాగానే కలిసొచ్చింది. అయితే సంక్రాంతికి మాత్రం ఒక్క పెద్ద సినిమా కూడా థియేటర్లకు రాలేదు. ‘బంగార్రాజు’ వచ్చినా అది మిడ్ రేంజ్ సినిమాగానే పరిగణించాలి. నాగార్జున సైతం మాది పెద్ద సినిమా ఏమీ కాదు అని చెప్పకనే చెప్పాడు.
అయితే ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.అందుకు తగ్గట్టే ఆ చిత్ర బృందం కూడా పోస్టర్స్ ను విడుదల చేసి ఆశలు పెంచుతున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ తో సహా కొంతమంది ప్రేక్షకులకి ‘ఈ చిత్రం విడుదలవుతుంది’ అనే నమ్మకం లేనట్టే కనిపిస్తుంది. నిజానికి ‘భీమ్లా నాయక్’ ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పోటీగా ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే అనౌన్స్మెంట్లు వచ్చినా ‘భీమ్లా’ వెనుకడుగు వేసేదే లేదని నిర్మాతలు బలంగా చెప్పారు.
కానీ చివరికి అనుకున్నట్టే అయ్యింది. ‘భీమ్లా’ ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ అయినట్టు ప్రకటించారు. అయితే ‘భీమ్లా’ ఫిబ్రవరి 25కి రావడం కష్టమని భావించి ‘గని’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి మిడ్ రేంజ్ సినిమాలు అదే రోజున రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్మెంట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది అని ప్రకటన వచ్చినా.. ఆ సినిమాలు పోస్ట్ పోన్ అయినట్టు ఇంకా అప్డేట్లు రాలేదు.
పైగా ఒకే రోజున ఇద్దరు మెగా హీరోలు అయిన పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లు పోటీ పడే అవకాశాలు కూడా ఉండవు. ‘భీమ్లా’ టీం ను సంప్రదించకుండా ‘గని’ టీం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోరు కదా.అదే పవన్ ఫ్యాన్స్ ఉద్దేశం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!