కొత్త నటీమణుల హవా

సినిమా ప్రపపంచం ఒక మాయాబజార్. ఇక్కడ ఏ చిత్రం హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో చెప్పలేము. ఈ విషయం హీరోయిన్స్ విషయంలోనూ వర్తిస్తుంది. అనుభవం కంటే ఆకర్షణకే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. అనుష్క, సమంత, కాజల్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రుతిహాసన్‌ వంటి స్టార్‌ హీరోయిన్స్ కంటే ఈ ఏడాది పరిచయం అయినా తారలే ఎక్కువ హిట్స్ అందుకున్నారు. దూసుకుపోతున్న కొత్త హీరోయిన్స్ పై ఫోకస్..

కీర్తి సురేష్‌నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. వెంటనే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం పెట్టేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి రిలీజ్ అయిన తర్వాత కీర్తిసురేష్‌ రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే “మహానటి”లో సావిత్రిగా నటిస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.

నివేదా థామస్‌నాని “జెంటిల్‌మేన్” సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికీ పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అలాగే నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మెహరీన్‌కొత్త హీరోయిన్ ఒక యేడాదిలో నాలుగు సినిమాల్లో నటించడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆ అవకాశం మెహరీన్‌కి లభించింది. “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ “మహానుభావుడు”, “రాజా ది గ్రేట్‌”, “కేరాఫ్‌ సూర్య”, “జవాన్‌” చిత్రాలతో దూసుకెళ్లింది.

ప్రగ్యా జైశ్వాల్‌కంచె, ఓం నమో వేంకటేశాయ చిత్రాలలో సంప్రదాయంగా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్‌ ఈ ఏడాది గ్లామర్ డోస్ పెంచింది. దీంతో వరుసగా ఆఫర్లు పట్టేసింది. “గుంటూరోడు”, “జయ జానకి నాయక”, “నక్షత్రం” చిత్రాల్లో అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం “ఆచారి అమెరికా యాత్ర”లో నటిస్తోంది.

ఇషా రెబ్బాతెలుగమ్మాయి ఇషా రెబ్బా “అమీతుమీ’తో వెలుగులోకి వచ్చింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో “మాయామాల్‌”, “దర్శకుడు” చిత్రాల్లో నటన పరంగా కూడా ఆకట్టుకొంది. ప్రస్తుతం నాని నిర్మిస్తున్న ‘అ’తో పాటు, మరో చిత్రంలోను నటిస్తోంది.

అను ఇమ్మాన్యుయేల్‌అమాయకంగా కనిపించే అను ఇమ్యానుల్ పై టాలీవుడ్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. తొలిసారి మజ్ను సినిమాలో నాని సరసన ముద్దుగా నటించిన ఈమె అందరినీ ఆకట్టుకుంది. తర్వాత “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు అజ్ఞాతవాసిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. అలాగే అల్లు అర్జున్ చేస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో హీరోయిన్ గా చేస్తోంది. ఇవే కాకుండా నాగచైతన్య, ఎన్టీఆర్‌ లతోనూ జోడీ కట్టనున్నట్టు తెలిసింది.

అనుపమ పరమేశ్వరన్‌మలయాళ కుట్టి అయిన ఈ బ్యూటీ అ..ఆ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగు ప్రేమమ్ లో చేసి ఆకట్టుకుంది. శతమానం భవతి చిత్రంతోను అందరి మెప్పు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఉన్నది ఒకటే జిందగీ” మూవీలో ఉత్తమ నటన ప్రదర్శించింది. అందుకే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం నానితో కలిసి ‘కృష్ణార్జున యుద్ధం’లోనూ, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఓ చిత్రంలోనూ నటిస్తోంది.

వీరు చేసిన సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అయి హిట్ సాధిస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ హీరోయిన్స్ గా గౌరవం అందుకుంటారు. అప్పుడు వచ్చే ఏడాది పరిచయమయ్యే నటీమణులతో పోటీ పడాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus