Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన
- October 15, 2026 / 03:24 PM ISTByFilmy Focus Desk
సినిమాను తెరకెక్కించడం ఎంత పెద్ద కష్టమో.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కూడా అంతే కష్టం.. ఈ రెండింటికి మించిన కష్టం ఇంకొకటి ఉంది. అదే సినిమాను ప్రమోట్ చేసుకునేటప్పుడు మాటలు కాస్త అటు ఇటు అయినా, ప్రగల్భాలు పలికినా.. ఆ తర్వాత ఎదురయ్యే ట్రోలింగ్‌ను తట్టుకోవడం. ఇప్పుడు ఇదే పరిస్థితి దాటి, నార్మల్ అవుతున్నారు దర్శకుడు మారుతి. ‘ది రాజా సాబ్’ సినిమా విషయంలోనే ఆయన ఈ ఇబ్బందులు పడ్డారనే విషయం తెలిసిందే.
Maruthi
‘ది రాజా సాబ్’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మొత్తం కారణం మారుతినే అన్నట్లు మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మీదనే పడ్డారు. ఆ సినిమా కథను ఓకే చేసిన ప్రభాస్‌ని, సినిమాలో ఆయన డూప్ చేసిన షాట్లను, కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను వదిలేసి మొత్తం మారుతి తప్పు అనేలా చేశారు. దీనికి కారణం ఆయన సినిమా ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, అడ్రెస్ చెప్పడాలే. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఇక కొత్త పని మొదలెడదాం అని మారుతి అనుకుంటున్నారు.
ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఒక హీరోతో సినిమా చేద్దామని ప్రయత్నాలు చేసిన ఆయన.. ఇప్పుడు ఆ ప్రయత్నాలు వదిలేసి కొత్త నటులతో సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ సినిమాను నవంబర్ నుండి సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ లాంటి సినిమాల తరహాలోనే పూర్తిగా కొత్త వాళ్లతోనే ఈ సినిమా ఉంటుందట. ఈ మేరకు ప్రస్తుతం హీరో హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతోందట.
సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తనకు బాగా దగ్గరైన గీతా ఆర్ట్స్‌లో చేస్తారా? లేక స్నేహితులతో కలసి సొంత బ్యానర్లోనే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.














