Bhamakalapam 2: ‘భామా కలాపం 2’… ఫస్ట్‌ స్క్రీనింగ్‌ వాళ్లకే… ఎవరికంటే?

థియేటర్ల కోసం సినిమాలు తెరకెక్కిస్తున్న బ్యానర్లు ఇప్పుడు ఓటీటీల కోసం సినిమాలు చేస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఓ ఓటీటీ ఇప్పుడు థియేటర్‌ కోసం సినిమా తెరకెక్కించింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా… ఇటీవల వాళ్లే ప్రకటించారు కాబట్టి నమ్మకతప్పదు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన డార్క్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘భామాకలాపం’ గురించే ఇదంతా. ఈ సినిమా రెండో పార్టు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం వైవిధ్యమైన ప్రచారానికి సిద్ధమైంది. ‘భామాకలాపం 2’ సినిమా గురించి తాజాగా ‘ఆహా’ టీమ్‌ ఆసక్తికర విషయం తెలియజేసింది. విడుదలకు వంద రోజుల ముందుగానే ఈ సినిమా చూసేందుకు అవకాశం ఇస్తామని చెప్పింది. డిసెంబర్‌ 10న సాయంత్రం 7 గంటలకు AAA సినిమాస్‌లో ‘భామాకలాపం 2’ ప్రీమియర్‌ షో వేస్తామని ప్రకటించింది. అలా అని అందరూ ఈ సినిమా చూసే అవకాశం లేదు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ అవకాశం.

అనుపమ మోహన్‌ (ప్రియమణి) ఓవ గృహిణి. యూట్యూబ్‌లో వంటల ఛానెల్‌ నిర్వహిస్తుంటుంది. కొత్త వంటకాలను చేయడంతో పాటు, పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న విషయాలను సైతం ఆసక్తి ఎక్కువ. ఇదిలా ఉండగా కోల్‌కతాలోని ఓ మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన గుడ్డు మాయమవుతుంది. ఆ గుడ్డు వల్ల అనుపమ, ఆమె కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది. ఆ ఆపద నుంచి వాళ్ల ఫ్యామిలీ ఎలా బయటపడింది? అనేది తొలిపార్టు కథ. మరి రెండో పార్టులో ఏం చూపిస్తారో చూడాలి.

‘భామాకలాపం 2’ (Bhamakalapam 2) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. తొలి సినిమాలాగే ఇందులోనూ డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు. ఓ చేతిలో వాక్యూమ్ క్లీనర్ పట్టుకుని ప్రియమణి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. అయితే ఆమె పక్కన రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉంది. అలాగే ప్రియమణి చుట్టూ గన్స్ ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మొత్తం సెటప్‌ వెనుక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ‘ది మోస్ట్ డేంజరస్ ఉమన్’ థియేటర్లలోకి రాబోతోంది అంటూ సినిమా నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus