ఎంత తపన, పట్టుదల ఉన్నా పరిస్థితులు సహకరించకపోతే ముందుకు వెళ్లలేం. ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి పరిస్థితి కూడా అలానే ఉంది. సినిమాను ఓ యజ్ఞంలా తీసుకొని, అధ్బుతంగా తెరకెక్కించే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంతకంతకు సినిమా షూటింగ్ మరియు విడుదల లేటు కావడం ఆయనపై ఒత్తిడి పెంచేస్తుంది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా కారణంగా షూటింగ్ జరపలేక పోతున్నారు.
ఇప్పటికే ఓ సారి మూవీ విడుదల తేదీ సడలించి జనవరి 8, 2021గా నిర్ణయించారు. నాలుగు నెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడగా, ఆ తేదీన మూవీ విడుదల కావడం అసంభవమే అని అంటున్నారు. ఇవి చాలవన్నట్టు రాజమౌళికి మరో కొత్త సమస్య వచ్చిపడిందట. లాక్ డౌన్ కి ముందే ఆర్ ఆర్ ఆర్ బిసినెస్ భారీగా జరిగింది. అన్ని భాషలకు మరియు ఏరియాలకు సంబంధించిన డీల్స్ పూర్తి కావడం మరియు అడ్వాన్సులు అందుకోవడం జరిగింది. బాహుబలి 2 చిత్రానికి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆర్ ఆర్ ఆర్ జరిపింది.
కాగా రాజమౌళిపై నమ్మకంతో కోట్లకు కోట్లు అడ్వాన్సులు ఇచ్చిన బయ్యర్లు తమ అడ్వాన్సులు వెనక్కి అడుగుతున్నారట. విడుదలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో మళ్ళీ అప్పుడు చెల్లిస్తాం, డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్మాత దానయ్యను అడుగుతున్నారట. వారు అడ్వాన్స్ వెనక్కి అడగడానికి కారణం మునుపటిలా వందల కోట్ల వసూళ్లు థియేటర్స్ ద్వారా రాకపోవచ్చనేది వారి అభిప్రాయంగా తెలుస్తుంది. దీనితో భారీగా జరిగిన ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ కి గండిపడేలా ఉంది.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!