Radhe Shyam: రాధేశ్యామ్ స్క్రీన్లు ఆ సినిమాకు ఇస్తున్నారా?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు భారీస్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో డ్రాప్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. బాహుబలి సిరీస్, సాహో సినిమాలను ఆదరించిన బాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాధేశ్యామ్ ను పట్టించుకోవడం లేదు. రాధేశ్యామ్ మూవీకి హిందీలో నెగిటివ్ టాక్ రావడంతో పాటు బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో కలెక్షన్లపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది.

Click Here To Watch Now

అయితే టాలీవుడ్ సినిమా అయిన రాధేశ్యామ్ పై బాలీవుడ్ క్రిటిక్స్ ప్రతీకారం తీర్చుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. గతేడాది బాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప బాలీవుడ్ లో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా తగ్గేదేలే అనే డైలాగ్ తో బన్నీ అకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలైన సమయంలోనే రిలీజైన 83 మూవీ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.

అయితే ప్రస్తుతం రాధేశ్యామ్ హిందీలో నెగిటివ్ టాక్ తో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే హిందీ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ ప్రభావం రాధేశ్యామ్ పై గట్టిగా పడుతోంది. వీకెండ్ తర్వాత రాధేశ్యామ్ సినిమా కోసం కేటాయించిన స్క్రీన్లు ది కశ్మీర్ ఫైల్స్ కు ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కలెక్షన్లు సైతం అంచనాలను మించి వస్తున్నాయి.

రాధేశ్యామ్ హిందీ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నా బాలీవుడ్ క్రిటిక్స్ రాధేశ్యామ్ కు మరీ ఘోరంగా రివ్యూలు ఇవ్వడంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. బాలీవుడ్ క్రిటిక్స్ పుష్ప దెబ్బకు రాధేశ్యామ్ సినిమాపై పగ తీర్చుకోవడం గమనార్హం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus