పెద్ద సినిమాలకు రూట్ క్లియర్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మిగిలిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా ముందుగా ఫిబ్రవరి 4న విడుదలవుతుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మేకర్స్ కూడా కొత్త రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు.

ఫిబ్రవరి 25 లేదా.. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పరిస్థితులను బట్టి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తామని తెలిపారు. అయితే అభిమానులు మాత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ చేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

‘ఆచార్య’, ‘భీమ్లానాయక్’లతో పాటు ‘ఎఫ్ 3’ సినిమా కూడా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మొదట ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 29న రిలీజ్ అని ప్రకటించారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ వస్తోంది కాబట్టి ‘ఎఫ్ 3’ వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు ముందుకు జరిగింది. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వెంకటేష్, రానా హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus