బుధవారం నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మళ్ళీ మొదలు

అట్టహాసంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాడు రాజమౌళి. హీరోలు తారక్‌, రామ్‌ చరణ్‌ షూట్‌లో జాయిన్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. చాలా రోజుల తరువాత సెట్స్‌కి రావడం సంతోషంగా వుందన్నారు. తుపాకులు, దుస్తులు దుమ్ము దులిపి కడిగినట్టు వీడియో రిలీజ్‌ చేశారు. అంతా చేసి రెండు రోజుల తరువాత ప్యాకప్‌ చెప్పారు. అక్టోబర్‌ 5న పునఃప్రారంభమైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌కి కొన్ని గంటల్లో బ్రేక్‌ పడింది.

మధ్యలో రాజమౌళి బర్త్‌డే వుందని బ్రేక్‌ తీసుకున్నట్టు వున్నారు. లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఏంటంటే… మళ్ళీ షూట్‌ స్టార్ట్‌ అవుతున్నది. బుధవారం నుండి తారక్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి మళ్ళీ సెట్స్‌ మీదకు రానున్నారు. ఈసారి బ్రేక్‌ ఇవ్వకుండా షూటింగ్‌ చేస్తార్ట. అక్టోబర్‌ 14 నుండి షూట్‌ మొదలుపెట్టి నాన్‌ స్టాప్‌గా రెండు నెలలు కంటిన్యూ షెడ్యూల్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశార్ట. మధ్యలో సండేలు బ్రేక్‌ తీసుకుంటే తీసుకోవచ్చని యూనిట్‌ వర్గాల టాక్‌. ఈ లాంగ్‌ షెడ్యూల్‌లో ఇద్దరు హీరోలు వుంటారు.

ఆల్రెడీ రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. విజయదశమికి ముందు ఎన్టీఆర్‌ టీజర్‌ రిలీజ్‌ చెయ్యనున్నట్టు అనౌన్స్‌ చేశారు. మొన్న రెండు రోజులు ఆ టీజర్‌కి సంబంధించి షాట్స్‌ తెరకెక్కించార్ట. ప్రస్తుతానికి సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పలేనని రాజమౌళి అంటున్నాడు. రెండు నెలల షూటింగ్‌ అనుకున్నట్టు సాగితే అప్పుడు చెప్తాడట. రీసెంట్‌గా రాజమౌళి బర్త్‌డేకి కంప్లయింట్స్‌ ఇస్తూ తారక్‌, చరణ్‌, కీరవాణి, ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ చేసిన వీడియో రెస్పాన్స్‌ బాగుంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus