పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సమాధానంగా ఈ ఏడాదే అని నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నారు. క్రిష్ ( Krish Jagarlamudi) ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా ఏఎం రత్నం (AM Ratnam) కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనుందని క్లారిటీ వచ్చేసింది. అయితే జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఏఎం రత్నం మాట్లాడుతూ అందరికీ సర్దుబాటు కావాలనే ఆలోచనతో క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చాడని చెప్పారు.
జ్యోతికృష్ణకు డైరెక్షన్ లో అనుభవం ఉందని హరిహర వీరమల్లు స్క్రిప్ట్ గురించి అవగాహన ఉందని అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండానే హరిహర వీరమల్లు పూర్తవుతుందని ఏఎం రత్నం కామెంట్లు చేశారు. తాను, పవన్ కూడా డైరెక్టర్లమే కాబట్టి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తామని ఏఎం రత్నం పేర్కొన్నారు. క్రిష్ ఎందుకు హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నాడో మాత్రం ఏఎం రత్నం క్లారిటీగా చెప్పట్లేదని నెటిజన్లు చెబుతున్నారు.
క్రిష్, జ్యోతికృష్ణ, రత్నం, పవన్ నలుగురు డైరెక్టర్లు ఒకే సినిమా విషయంలో వేలు పెడితే కొన్నిసార్లు రిజల్ట్ మారే ఛాన్స్ కూడా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఓజీ సినిమా వాయిదా పడటం పక్కా అని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఓజీ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలేవీ చెప్పిన సమయానికి విడుదల కావడం లేదు.
స్టార్ హీరోల సినిమాలలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రీజన్ వల్ల కూడా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటే తప్ప ఆయన సినిమాల రిలీజ్ డేట్స్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు వాయిదా పడితే నిర్మాతలపై వడ్డీ భారం కూడా పెరిగే అవకాశం ఉంది. పవన్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.