లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. సెప్టెంబర్ నుంచి థియేటర్లు మళ్ళీ తెరవడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఎవరూ లెక్కవేయలేని విషయం. అయితే. ఈ క్రమంలో పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ బాటపట్టాయి. మొదట్లో కాస్త ఉపేక్షించిన దర్శకనిర్మాతలు కూడా వేరే మార్గం లేదని గ్రహించి ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే.. బాలీవుడ్ లో అగ్ర తారలు కూడా తమ సినిమాల ఆన్లైన్ విడుదలకు సమ్మతించినప్పటికీ.. సౌత్ లో మాత్రం ఇప్పటివరకు చిన్న మరియు మీడియం సినిమాలు మాత్రమే ఓటీటీ ద్వారా విడుదలయ్యాయి.
అందుకు తెలుగులో అగ్ర తారల సినిమాలు రిలీజ్ కి రెడీ లేకపోవడం ఒక కారణమైతే.. “వి, నిశ్శబ్దం” లాంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నుంచి భారీస్థాయి ఎమౌంట్ లు ఆశిస్తుండడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ఆగస్టు 14న “మాస్టర్”ను విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం పెను దుమారాన్ని లేపింది. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం “మాస్టర్” లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే.. సడన్ గా అమెజాన్ ప్రైమ్ ప్రకటన అందర్నీ కంగారు పెట్టింది. అయితే విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ పేర్కొన్న మాస్టర్ ఓ కొరియన్ చిత్రం. ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయడానికి ఏకంగా నిర్మాణ సంస్థ స్వయంగా సమాధానం చెప్పాల్సి వచ్చిందంటే ఊహించండి ఎంత హడావుడి జరిగి ఉంటుందో.
Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!