నటి పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన ముఠా అరెస్ట్..!

ఇటీవల నటి షమ్మా కాసిమ్.. అదేనండీ మన తెలుగు హీరోయిన్ పూర్ణను కొంతమంది వేదిస్తున్నట్టు ఆమె బెంగుళూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కొంతకాలం నుండీ తన సొంత ఊరు అయిన కేరళలోనే ఉంటూ వస్తున్న పూర్ణని కొంతమంది ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. అంతేకాదు ఆమె ఫేస్బుక్ కు కూడా అసభ్యకరమైన మెసేజ్ లు పంపి.. ఆమెను ఇబ్బంది పెట్టినట్టు కూడా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పూర్ణ పేర్కొంది.

ఈ క్రమంలో పూర్ణ ఇచ్చిన కంప్లైంట్ ను స్వీకరించి దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన 8 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారట. వాళ్ళే పూర్ణని వేధించినట్టు పోలీసులు ధృవీకరించారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడడంతో అంతా షాక్ అయ్యారని తెలుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందితో పాటు మరో 4మంది కూడా ఉన్నారట. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు వీరు గుర్తించారు.

కొంతమంది మోడల్స్ ను వర్ధమాన హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడంలో ఈ ముఠా ఆరితేరి ఉందట. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ముందుగా హీరోయిన్ పూర్ణ కుటుంబ సభ్యులకు పెళ్లి ప్రతిపాదనతో వారు దగ్గరయ్యి.. కిడ్నాప్ చేసి డబ్బులు రాబట్టుకోవాలని ప్లాన్ చేశారట. పూర్ణ నుండీ కోటిన్నర వరకూ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ పూర్ణ ఫ్యామిలీ అందుకు నిరాకరించడంతో.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయారని సమాచారం.

1

2

3

4

5

6

7

8

Suvarna Sundari Actress Poorna Black Dress Photos

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus