నువ్వు చెప్పు… నేను కొడతా అంటున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. ‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

‘సాహో’ పై మరింతగా ఆసక్తి పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఆ అంచనాల్ని మరింత పెంచేలా ఒక్కో క్యారెక్టర్ కు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దర్శకుడు సుజిత్… ప్రభాస్ కు కొన్ని సూచనలు చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘నువ్వు చెప్పు నేను కొడతా’ అని ప్రభాస్… సుజీత్ కు చెబుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus