Manoj,Mounika: తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తజంట… ఫోటోలు వైరల్!

మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహం జరిగిన తర్వాత వీరిద్దరూ జంటగా పలు ప్రాంతాలకు వెళ్తూ పెద్దల ఆశీర్వాదంతో పాటు భగవంతుడు ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత మంచు లక్ష్మి నివాసం నుంచి నేరుగా కర్నూలుకు వచ్చినటువంటి ఈ జంట ముందుగా మౌనిక తాతయ్య ఎస్వి సుబ్బారెడ్డి గారిని కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అనంతరం ఈ దంపతులు కర్నూలుకు వెళ్లి భూమ మౌనిక తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఇకపోతే ల నేడు మౌనిక మనోజ్ దంపతులు తిరుమలకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం బయట మౌనిక దంపతుల సందడి చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తిరుమల శ్రీవారిని మంచు మనోజ్ దంపతులతో పాటు మంచు లక్ష్మి దంపతులు తన కుమార్తె కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా స్వామివారి దర్శనం తర్వాత మనోజ్ మౌనిక దంపతులు ఆలయం బయట సందడి చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మంచు మనోజ్ మౌనిక రెడ్డి కుమారుడు ధైరవ్ రెడ్డిని ఎత్తుకొని కనిపించారు. దీంతో ఈ ఫోటోలు పై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మౌనిక మనోజ్ కన్నా ముందుగా గణేష్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ దంపతులకు ధైరవ్ రెడ్డి జన్మించిన తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ క్రమంలోనే ధైరవ్ రెడ్డి మౌనిక వద్ద ఉన్నారు. ఇక మౌనికను ప్రేమించిన మనోజ్ మౌనికతో పాటు తన కుమారుడు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లిలో కూడా చిన్నారి ధైరవ్ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా తిరుమలలో ఏకంగా మనోజ్ ధైరవ్ రెడ్డిని ఎత్తుకొని కనిపించడంతో ఈయన మంచి మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus