హనీమూన్ కి వెళ్తోన్న కొత్త జంట!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత వారంలో కాజల్, గౌతమ్ ల వివాహం జరిగింది. ముంబైలో ఓ హోటల్ లో అతి కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తరువాత రెండు వారాలు బ్రేక్ తీసుకొని తిరిగి మళ్లీ సినిమా షూటింగ్ లో కాజల్ పాల్గొనున్నట్లు వార్తలు వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ని పునః ప్రారంభించనున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాజల్ కూడా మరో వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతారని.. ఆ షెడ్యూల్ పూర్తయిన తరువాత హనీమూన్ ప్లాన్ చేస్తుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కాజల్ మాత్రం ఈ వార్తలను భిన్నంగా నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్ కి ముందే నూతన దంపతులు ఇద్దరూ హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు.

ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. తాను హనీమూన్ కి వెళ్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. కాజల్ కిచ్లు, గౌతమ్ కిచ్లు పేర్లతో ఉన్న పౌచ్ లతో పాటు పాస్ పోర్ట్ లను షేర్ చేసింది. దీనికి ‘బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నా.. రెడీ టూ గో’ అంటూ కామెంట్ పెట్టింది. అయితే ఎక్కడకి వెళ్తున్నారని విషయాలను మాత్రం చెప్పలేదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus