Prabhas: ఒక్క అడుగు సినిమాకు డైరెక్టర్ అతనేనా?

ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన ఒక్క అడుగు డైలాగ్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయింది. కృష్ణంరాజు ఈ సినిమా కథను సిద్ధం చేయగా చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

అందువల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని చాలామంది భావించారు. అయితే కృష్ణంరాజు ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మెసేజ్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఉండే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఈ సినిమాకు ఏ డైరెక్టర్ ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ఒక్క అడుగు సినిమాలో కచ్చితంగా నటిస్తానని కృష్ణంరాజుకు మాటిచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ అడిగితే పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నో చెప్పే అవకాశం అయితే లేదు. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

ప్రభాస్ ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ తో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. ప్రభాస్ మార్కెట్ పెరగడంతో ప్రభాస్ తో సినిమాలను నిర్మించాలని ఆశిస్తున్న నిర్మాతల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క అడుగు ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus