Allu Arjun: ఆ పాత్ర పరిధి పెంచిన లెక్కల మాస్టార్!

పుష్ప ది రైజ్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప ది రూల్ ను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తైనా ఆ సన్నివేశాలను కూడా రీషూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారు.

బాలీవుడ్ ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని సుకుమార్ కథలో మార్పులు చేస్తున్నారని సమాచారం. పుష్ప పార్ట్2లో బాలీవుడ్ నటులకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా. పుష్ప ది రూల్ లో సునీల్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ పాత్ర పుష్ప ది రూల్ కు హైలెట్ గా నిలుస్తుందని బోగట్టా. పుష్ప ది రూల్ తో బన్నీకి క్రేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పుష్ప ది రైజ్ రిజల్ట్ విషయంలో బన్నీ అభిమానులు సంతృప్తితో ఉన్నారు. ఏప్రిల్ నెల నుంచి పుష్ప ది రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. తొలి భాగాన్ని మించిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. పుష్ప పార్ట్2 లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం. రష్మిక పాత్రకు రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. తొలి భాగంలో షాకింగ్ ట్విస్ట్ లేకపోయినా బన్నీ తన నటనతో ఈ సినిమాపై అంచనాలను పెంచారు.

పుష్ప ది రూల్ లో కేశవ పాత్రతో సుకుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారని సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. బన్నీ పుష్ప ది రూల్ కు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ తర్వాత బన్నీ నటించే సినిమాల వివరాలు తెలియాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus