రామ్ చరణ్ (Ram Charan) బర్త్‌డే దగ్గరపడుతున్న తరుణంలో అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్‌లు పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 27న మెగా పవర్ స్టార్ బర్త్ డే కావడంతో, ఈసారి ఏదైనా మేజర్ అప్‌డేట్ రాబోతోందని మెగా ఫ్యాన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 (RC 16 Movie) చిత్రం నుంచి తొలిసారి ఏదైనా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రావొచ్చని అభిమానులలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం మైసూరు, ఢిల్లీ, హైదరాబాద్ లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే అధికారికంగా ఏ ఒక్క అప్‌డేట్‌ను కూడా చిత్రబృందం బయటపెట్టలేదు. టైటిల్ విషయంలో ‘పెద్ది’ అనే పేరు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నప్పటికీ, మేకర్స్ మాత్రం ప్రైవేసిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా బర్త్‌డే రోజు బిగ్ అనౌన్స్‌మెంట్ కోసం హైప్ క్రియేట్ చేస్తోందనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా, అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ కోసం ప్రత్యేక ఫోటోషూట్ జరిగింది.
ఇది బర్త్‌డే టైటిల్ పోస్టర్‌కి సంబంధించినదా లేక సినిమాకు సంబంధించిన కీలక లుక్ రిలీజ్ కోసమా అన్నదానిపై క్లారిటీ రాలేదు. కానీ, బుచ్చిబాబు గతంలో చేసిన ‘ఉప్పెన’ (Uppena) ప్రమోషనల్ స్ట్రాటజీని గుర్తు చేసుకుంటే, ఈ ఫోటోషూట్ వల్ల ఏదో ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చే ఛాన్స్ పక్కా అన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఆమెకు ఇదే తొలి సినిమా కావడంతో, ఈ జోడీపై బాగా ఆసక్తి నెలకొంది.
ఇక సంగీతంలో ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) అనగానే అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఆయన ట్యూన్స్ బుచ్చిబాబుకి కావాల్సిన ఎమోషనల్ గ్రావిటీని అందిస్తాయని యూనిట్ విశ్వాసంతో ఉంది. ఈ సినిమాను 2026 సమ్మర్ లోనే విడుదల చేయాలనే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం చరణ్ బర్త్‌డే ఈ మూవీకి మైల్‌స్టోన్‌గా మారనుందని చెప్పొచ్చు. RC16 టీం నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా అది ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ అవుతుంది. మరి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.