Nidhhi Agerwal: సినిమా అగ్రిమెంట్‌లో ఇలాంటి పాయింట్లు కూడా ఉంటాయా?

బాలీవుడ్‌లో సినిమా అంటే.. పుకార్లు సహజం అని అంటుంటారు. ఇక్కడ పుకార్లు అంటే.. రిలేషన్‌షిప్‌ పుకార్లు అని అర్థం. ఇలా షూటింగ్‌ మొదలైందో లేదో వెంటనే ఆ సినిమాలో నటిస్తున్న హీరో – హీరోయిన్‌ మధ్యన ఏదో నడుస్తోందని, రిలేషన్‌లో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. వాటికి తోడు ఆ జంట కూడా అలానే బయట షికార్లు తిరగడంతో అవి ఎక్కువవుతాయి. అలాంటి బాలీవుడ్‌లో ఓ సినిమా టీమ్‌ ‘నో డేటింగ్‌’ షరతు పెట్టింది అంటే నమ్ముతారా?

Nidhhi Agerwal

అవును ఇది జరిగింది. అయితే ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితం. ఈ విషయాన్ని కథానాయిక నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , ప్రభాస్‌ (Prabhas)  ‘ది రాజాసాబ్‌’ (The Rajasaab)  సినిమాలతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నిధి అగర్వాల్‌ రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. ఈ క్రమంలో ఆ సినిమాల విషయాలతోపాటు, కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. అప్పుడే ఈ నో డేటింగ్‌ విషయం గురించి చెప్పుకొచ్చింది.

‘‘మున్నా మైకేల్‌’ సినిమాతో కెరీర్‌ మొదలు పెట్టింది నిధి అగర్వాల్‌. ఆ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్‌ కాంట్రాక్ట్‌ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారట. అందులో సినిమాకు సంబంధించిన విధి విధానాలతోపాటు.. మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉందట. అదే నో డేటింగ్‌ రూల్‌. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో డేట్‌ చేయకూడదు అనేది ఆ రూల్‌ సారాంశం. అయితే కాంట్రాక్ట్‌ మీద సంతకం చేసినప్పుడు నిధి ఆ విషయం చదవలేదట.

సినిమా షూటింగ్‌ జరుగుతున్న కొద్ది రోజుల తర్వాతే ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయిందట. అయితే ఎందుకు అలా రాశారు అని అడగలేద. హీరో – హీరోయిన్లు ప్రేమలో పడితే నటనపై దృష్టి పెట్టరని సినిమా బృందం అనుకొని ఉండొచ్చు అని చెప్పింది నిధి అగర్వాల్‌. ఆమె చెప్పిందంతా ఓకే కానీ.. బాలీవుడ్‌లో ఇలాంటి రిలేషన్‌ పుకార్లతోనే సినిమాల ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకలా చేశారబ్బా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus