Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఏం తింటుందో తెలుసా? ఆమె డైట్‌ ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవీ!

తెలుగు సినిమాల్లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వని హీరోయిన్లు ఉండరు. అందరూ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకే ప్లాన్‌ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు ఉండేలా చూసుకుంటున్నారు. మరి ‘హరి హర వీరమల్లు’ కథానాయిక నిధి అగర్వాల్‌ ఫుడ్‌ ఇంట్రెస్ట్‌లు ఏంటో తెలుసా? సగటు హీరోయిన్‌లాగే ఫుడ్‌ డైట్‌ పాటించినా అందులో ఇడ్లీలకు చాలా పెద్ద స్థానం ఉంది.

Nidhhi Agerwal

నిధి అగర్వాల్‌ శాఖాహారి. అయితే అప్పుడప్పుడు గుడ్లు తింటుంది. ఇక ఫ్రై చేసిన ఆహారం ఇష్టమే కానీ ఎప్పుడో కానీ తినదు. ఇక స్పైసీ ఫుడ్‌ అంటే ఇష్టంగా తింటుంది. చైనీస్‌ ఫుడ్‌ అంటే నచ్చదు కానీ.. జపనీస్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటే జొన్న రోటీ, సజ్జల రోటీలు ఆహారంలో ఉండాల్సిందే. ఇక అది ఆదివారమైతే ఉదయం ఇడ్లీ, లంచ్‌లో ఎయిర్‌ ఫ్రైడ్‌ ఛోలే బటురే ఉండాల్సిందే.

ఇక భోజనంలో అన్నం తినాలని అనుకుంటే.. రైస్‌ పరిమాణం 100 గ్రాములు ఉండేలా చూసుకుంటుంది. అంతకుమించి ఎక్కువ తీసుకోదు. ఇదంతా చెప్పారు స్పెషల్ అని చెప్పిన ఇడ్లీల సంగతేం చెప్పలేదు అనుకుంటున్నారు. చెబుతాం చెబుతాం స్పెషల్‌ కదా అని లాస్ట్‌కి ఉంచాం. నిధికి ఇడ్లీలు అంటే ప్రాణం. మూడు పూటలా భోజనంలో ఇడ్లీ పెట్టినా తినేస్తుంది. దానికి పలుచని కొబ్బరి చట్నీ ఉండాల్సిందే.

పనిలో పనిగా ఫిట్‌నెస్‌ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది హీరోయిన్లలాగే రోజూ కచ్చితంగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. సినిమా షూటింగ్‌లో ఎంత అలసిపోయినా రోజూ ఏదో సమయంలో జిమ్‌కి వెళ్తుంది. అంతలా ఫిట్‌నెస్‌ విషయంలో ఆలోచిస్తోంది కాబట్టి సినిమాల్లో 2017లో వచ్చినప్పుడు ఎంత ఫిట్‌గా ఉందో ఇప్పుడూ అంతే ఫిట్‌గా ఉంది.

ఇక నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఆమె మరో సినిమా ‘ది రాజా సాబ్‌’ డిసెంబరులో తీసుకొస్తారని గతంలో చెప్పారు. అయితే విడుదల వాయిదా పడొచ్చు అనేది లేటస్ట్‌ టాక్‌. చూద్దాం టీమ్‌ ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో.

‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus