నిథి అగర్వాల్ నుండి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. 2022 లో వచ్చిన ‘హీరో’ తప్ప.. ఆమె మరో తెలుగు సినిమాలో నటించలేదు. మొత్తానికి ఆమె మరో 7 రోజుల్లో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఆమె తన కెరీర్ లో వచ్చిన గ్యాప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “ఇది బిగ్ స్పాన్ మూవీ. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం పొందడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. పంచమి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇందులో నా పాత్రలో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. పవన్ సార్ తో నా కాంబినేషనల్ సీన్స్ బాగుంటాయి. డాన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను. అది కూడా ఆకట్టుకుంటుంది.
డ్రెస్సింగ్ కావచ్చు, ధరించిన హారాలు వంటివి కావచ్చు… బాగా డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఒరిజినల్ గోల్డ్ వాడటం జరిగింది. నేను ధరించిన నగల విలువ దాదాపు రూ.2 కోట్లు. రోజూ షూటింగ్ కోసం 2 గంటలు రెడీ అవ్వాల్సి వచ్చేది. దర్శకులు క్రిష్ గారు నా పాత్రని వివరించిన తీరు కూడా నాకు బాగా నచ్చింది. భరతనాట్యం సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను.
పవన్ కళ్యాణ్ సార్ తో కలిసి నటించే ఛాన్స్ ఇంత తొందరగా వస్తుందని నేను ఊహించలేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడటానికి నా అనుభవం సరిపోదు. నా కెరీర్ లో నేను వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే అని నాకు ప్రాజెక్టు మొదలైనప్పుడే అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చింది.