Nidhhi Agerwal: వీడియోతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చిన నిధి అగర్వాల్..!

నాగ్ చైతన్య- చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. అటు తర్వాత ‘మిస్టర్ మజ్ను’ లో కూడా నటించి మెప్పించింది. కానీ పూరి జగన్నాథ్- రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి.ఆ మూవీలో ఈమె అందాల ఆరబోతకి కుర్రకారు ఫిదా అయిపోయారు.అనంతరం దర్శకనిర్మాతలు కూడా ఈమె కాల్ షీట్లు కోసం ఎగబడ్డారు.

తమిళంలో కూడా శింబు, జయం రవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి అక్కడ కూడా ఫేమస్ అయిపొయింది నిధి. అవి కూడా మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆమె స్టార్ డం మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’మూవీ ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. పంచమి అనే పాత్రలో ఈమె కనిపించబోతుంది. దాంతో పాటు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ ‘హీరో’ కూడా ఈమెనే హీరోయిన్ గా నటిస్తుంది.

నిధి సోషల్ మీడియాలో యమ గ్లామర్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఓ హాట్ వీడియోని షేర్ చేసి కుర్రకారుని కట్టిపడేసిందనే చెప్పాలి. ఫోటో షూట్ సెషన్లో నిధి పాల్గొన్నప్పుడు తీసిన వీడియో ఇదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus