నిహారిక పెళ్లి… కొత్త అప్డేట్ ఇచ్చిన నాగబాబు..!

ఈ లాక్ డౌన్ టైములో టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలు నిఖిల్, నితిన్.. అలాగే రానా వంటి వారు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు..అంతేకాదు దిల్ రాజు(రెండో పెళ్లి), ‘రంగస్థలం’ మహేష్ వంటి వారి పెళ్లిళ్లు కూడా ఈ లాక్ డౌన్ టైములోనే బంధుమిత్రుల సమక్షంలో జరిగాయి.ఇక మన మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ కూడా ఈ లాక్ డౌన్ లో జరిగిన సంగతి తెలిసిందే.

గుంటూరు ఐ.జి కొడుకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఇదిలా ఉండగా.. నాగబాబుని నిహారిక పెళ్లి డేట్ గురించి ప్రశ్నించగా.. ఆయన దానికి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు… నిహారిక పెళ్లి గురించి స్పందించి కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “నిహారిక పెళ్లి ఫిక్స్ అవ్వడంతో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ కరోనా వల్ల ఈ సంవత్సరం చాలా భయానకంగా సాగుతోంది.

పెళ్లి పనులు మొత్తం మా అబ్బాయ్ వరుణ్ తేజే చూసుకుంటున్నాడు. నిహారిక కు డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నాము… డిసెంబర్ లో పెళ్లి ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని లొకేషన్స్ ను వరుణ్ అనుకుంటున్నాడు. అందుకోసం కొన్ని పేర్లతో ఓ లిస్ట్ ను కూడా తయారు చేసాడు. మ్యారేజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం” అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus