Niharika, Varun Tej: వరుణ్ తేజ్, నిహారిక ల రక్షా బంధన్ సెలబ్రేషన్స్ వీడియో వైరల్..!

రాఖీ పండుగను అంతా ప్రత్యేకంగా చూస్తుంటారు. అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టి.. వాళ్ళు కలకాలం సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సోదరీమణులు. అలాగే అమ్మలో సగం… నాన్నలో సగం అయ్యి తమ చెల్లి లేదా అక్కలను సంతోషంగా ఉండాలని సోదరులు కోరుకుంటారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. ఈసారి ఆగస్టు 11న రాఖీ పండుగను జరుపుకుంటున్నారు కొంతమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు. మరికొంతమంది అయితే ఆగస్టు 12న అసలైన రాఖీ పండుగ అంటున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మెగా డాటర్ నిహారిక కూడా తన అన్న వరుణ్ తేజ్ కి రాఖీ కట్టి… రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది.అంతేకాదు తన అన్నయ్య పాదాలకు కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే ఇదే వీడియోలో అన్నా చెల్లెల్లలో రెండు రకాల షేడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ‘ఫన్నీ వే’లో చూపించారు వరుణ్, నిహారిక లు.

ఈ వీడియోను నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోని తీసింది తన తండ్రి నాగబాబు కొణిదెల అని కూడా తెలియజేసింది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్లో ‘అన్నయ్య అన్నావంటే’ అంటూ పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ చిత్రంలోని పాట ఉండటాన్ని మనం గమనించవచ్చు. నిహారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus