సరికొత్త ప్రయోగం చేయబోతున్న నిహారిక..!

కొన్ని టీవీ షోల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టి ‘ముద్ద ప‌ప్పు ఆవ‌కాయ’ అనే వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయ్యింది మెగా డాటర్ నిహారిక‌. తరువాత ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు చిత్రాలు ప్లాపులు గా మిగిలాయి. ఇక నిహారిక నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’ కి కూడా నెగెటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి హీరోయిన్ గా చేయడానికి కొన్ని రూల్స్ పెట్టి ఓకేచెసారు. దీంతో ఈ అమ్మడు గ్లామౌ షో చేయకూడదు, రొమాంటిక్ సీన్లలో నటించకూడదు, ముద్దు సీన్లు అసలే ఉండకూడదు కాబట్టి పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కడం లేదు. ఈ విషయాన్ని నిహారిక కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

దీంతో మళ్ళీ ఈ అమ్మడు వెబ్ సిరీస్ లు చేసుకుందాం అని ఫిక్సయిపోయినట్టుంది. త్వ‌ర‌లోనే ఓ కొత్త వెబ్ సిరీస్‌కి శ్రీ‌కారం చుట్ట‌బోతోందట. ఈ వెబ్ సిరీస్లో ఈమె నటించడమే కాదు… నిర్మాతగా కూడా వ్యవహరిస్తుందట. ఇప్పటి వరకూ… వెబ్ సిరీస్ అంటే.. ఓ క‌థ‌ని కొన్ని ఎపిసోడ్స్ గా విడగొట్టి చెప్ప‌డం. కానీ నిహారిక రూపొందించే ఈ కొత్త వెబ్ సిరీస్ కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేంటంటే .. ప్ర‌తీ ఎపిసోడ్లోనూ ఓ కొత్త క‌థ ఉంటుందట. ‘అమృతం’ సీరియల్ లా అన్న‌మాట‌. అప్పట్లో ‘అమృతం’ సీరియల్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌ అని చెప్పడంలో సందేహం లేదు. ప్ర‌తి ఎపిసోడ్‌కూ ఓ కొత్త క‌థ ఉంటుంది. ఈసారి వెబ్ సిరీస్ లో కూడా అలాంటి ప్ర‌యోగమే చేయ‌బోతుందట నిహారిక.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus