నాగబాబు కుమార్తె నిహారిక ఒక మనసు సినిమా ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంది గానీ హిట్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళంలోకి అడుగు పెట్టింది. ఆర్ముగకుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్” చిత్రంతో కోలీవుడ్ లో ప్రవేశించింది. ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత సుమంత్ అశ్విన్ తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా చేసింది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కూడా చక్కగా నటించింది. అయినా మూవీ ఆర్ధికంగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ చిక్కుల్లో పడింది. ఆమె నటన బాగుంటే సరిపోదు.. సినిమా హిట్ అయితే ఆమె డేట్స్ కోసం నిర్మాతలు బారులు తీరుతారు.
మెగా హీరోయిన్ అని, పబ్లిసిటీ కి పనికొస్తుందని ఇదివరకు దర్శకనిర్మాతలు ఆమె గురించి ఆలోచించేవారు. నిహారిక కోసమే అన్నట్టు పాత్రలను క్రియేట్ చేసేవారు. లాభాలు రాకపోవడంతో ఆమె అవసరమా? అని అంటున్నారు. ప్రస్తుతం కొత్త లేడీ డైరక్టర్ సుజనా దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తోంది. ఇందులో శ్రియాతో కలిసి నిహారిక స్క్రీన్ చేసుకోనుంది. అలాగే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతునున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న మొదటి చిత్రంలో కూడ నిహారిక హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని దర్శకురాలు ప్రణిత బ్రమండపల్లి డైరెక్ట్ చేయనుండగా రాహుల్ విజయ్ హీరోగా నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు ఆర్ధికంగా విజయం సాధించకపోతే నిహారికకి ఎవరూ అవకాశం ఇచ్చేలాకనిపించడం లేదు.