ముందే… నా ఫ్యామిలీ అంతా నన్ను రెడీ చేసారు : నిహారిక

మెగా డాటర్ నిహారిక ‘సూర్యకాంతం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. మర్చి 29(రేపు) న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో ఈ చిత్రం నిర్మితమయ్యింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడేళ్ళవుతున్నప్పటికీ ఎక్కువ సినిమాలేమీ చేయలేదు నిహారిక. ఇక ‘సూర్యకాంతం’ మినహాయిస్తే గతంలో నిహారిక చేసిన రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అయితే నిహారిక పై రూమర్స్ మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటున్నాయి. ఏకంగా ప్రభాస్ తో కూడా నిహారిక ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి.

ఇక ఈ రూమర్స్ పై తాజాగా నిహారిక స్పందించింది. నిహారిక మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీకి వచ్చే ముందే.. మా ఫ్యామిలీ అంతా నన్ను ప్రిపేర్ చేశారు. రక రకాల రూమర్స్ వస్తాయి… వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని. కానీ.. నా నమ్మకం ఏంటంటే.. నిప్పు లేకుండా పొగ రాదు కదా.. సో నా మీద పెద్దగా రూమర్స్ ఏమీ రావులే అనుకున్నాను. కానీ కొన్ని రూమర్స్ చూసిన తర్వాత బాబోయ్.. అసలు నిప్పు లేకుండా కూడా ఇంత పొగ వస్తుందా అని ఆశ్చర్యపోయాను. నాగశౌర్య, విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్నానని రాసేశారు. ఇక ప్రభాస్ తో అయితే… ఏకంగా పెళ్ళి చేసుకుంటున్నానంటూ ఏవేవో వార్తలు రాసేశారు. అలాంటిదేమీ లేదండీ బాబు” అంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus