Niharika: కెన్యాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో!

నిహారిక కొణిదెల అందరికీ సుపరిచితమే. నాగ బాబు కూతురిగా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి అటు తర్వాత కొన్ని షోలలో సందడి చేసి.. అటు తర్వాత మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ తో, ఫాలోయింగ్ తో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘ఒక మనసు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక … అటు తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

‘సైరా’ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసినా ఈమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. అటు తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్లలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే టైంలో లాక్ డౌన్ కూడా రావడంతో … పెద్దలు చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిపించారు. కొన్నాళ్ళు బాగానే కలిసున్న ఈ జంట.. అటు తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. మరోపక్క వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ (Niharika) నిహారిక బిజీగా గడుపుతోంది.

ఈ క్రమంలో కొంత గ్యాప్ తీసుకుని తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ తన అన్న వరుణ్ తేజ్ అలాగే తండ్రి నాగబాబు అలాగే ఆమె తల్లి పద్మజతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ‘ఈ ట్రిప్ కి లావణ్య త్రిపాఠి మిస్ అయ్యిందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus