విజయ్ దేవరకొండ ని ఫాలో అయిన నిహారిక..!

మెగాడాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’. రాహుల్ హీరోగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా పెర్లెన్ భేసానియా నటిస్తుంది. ప్రణిత్ బ్రమండపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. ఇక చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. ‘నిర్వాణ సినిమాస్’ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్ తెలుపుతుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమా కథను దర్శకుడు ఎంచుకున్నాడు. ఒక అబ్బాయి ఒకేసారి ఇద్దరమ్మాయిలను ఇష్టపడితే తరువాత ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఈ ట్రైలర్లో చూపించారు. ఆ ఇద్దరమ్మాయిలలో ఒకరు డిమాండింగా, బోల్డ్ గా ప్రవర్తిస్తే మరొకరు సెన్సిబుల్ గా ఉంటారు. వీరిద్దరిలో హీరో ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనేదే శుభం కార్డుకు ముందు వచ్చే సన్నివేశం అనుకోవాలి. ట్రైలర్ లో నీహారిక మిడిల్ ఫింగర్ చూపించడం… మనకి విజయ్ దేవరకొండ ను గుర్తు చేస్తుంది.. ఈ సీన్ హైలైట్ గా నిలుస్తుంది. ‘నన్ను ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసావ్ రా ఎదవ’ అని నిహారిక చెప్పే డైలాగ్, అలాగే హీరో రాహుల్, సత్య, శివాజీ రాజా కు మధ్య వచ్చే చిన్న కామెడీ బిట్లు ట్రైలర్లో ఉన్నాయి. కథ కొత్తదేమీ… నిహారిక యాక్టింగ్ కూడా..! అయితే మొదట విడుదల చేసిన టీజర్ వెబ్ సిరీస్ ఫీలింగ్ ను తలపిస్తే.. ఈ ట్రైలర్ మాత్రం కొంచెం పర్వాలేదనే ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. ఓపికుంటే మీరు కూడా ఈ ట్రైలర్ ఒకసారి చూడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus