మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి, వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా నిహారిక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరైన నిహారిక ఈ షోలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో పుట్టానని మూడో తరగతి వరకు భవన్స్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నానని ఆ తర్వాత మరో స్కూల్ లో చదువుకున్నానని నిహారిక అన్నారు. ఓబుల్ రెడ్డి కాలేజ్ లో ఇంటర్, సెయింట్ మేరీస్ లో మాస్ కమ్యూనికేషన్ చేశానని నిహారిక చెప్పుకొచ్చారు.
నటిగా తనకు చిరంజీవి గారే స్పూర్తి అని నిహారిక కామెంట్లు చేశారు. నాన్న ఒకసారి కొట్టారని, అమ్మ తినడం విషయంలో చాలాసార్లు కొట్టిందని, అన్నయ్య బాగా ఏడిపిస్తాడని నిహారిక వెల్లడించారు. వరుణ్ అన్న చాలా మాటకారి అని కానీ సాఫ్ట్ గా ఉంటాడని నిహారిక చెప్పుకొచ్చారు. ఒక మనసు సినిమాను చూసి ఫ్యామిలీలో ఎవరూ బాగోలేదని చెప్పలేదని నా కష్టం వాళ్లు చూశారని నిహారిక అన్నారు. నాన్న బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో బావగారూ బాగున్నారా తనకు ఇష్టమని నిహారిక చెప్పుకొచ్చారు.
వరుణ్ నటించిన సినిమాలలో గద్దలకొండ గణేష్ తనకు చాలా ఇష్టమని నిహారిక వెల్లడించారు. చరణ్ అన్న నాకు అండగా ఉంటారని చరణ్ మాటల్లో భరోసా ఉంటుందని నిహారిక కామెంట్లు చేశారు. బన్నీ లుక్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడని మామయ్య కొడుకు అయినా బన్నీని అన్న అని పిలుస్తానని నిహారిక తెలిపారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!