మెగా హీరోలను మించిపోతున్న మెగా డాటర్

సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే… అది వెనక్కి తగ్గిందని అర్ధం కాదు.. మరింత వేగంగా దూకడానికని అర్ధం చేసుకోవాలి… మెగా డాటర్ నిహారిక గురించి చెప్పడానికి ఈ డైలాగ్ కొంచెం అతిగా ఉంది గాని.. ఆమె కెరీర్ కి మాత్రం ఇది బాగా సూట్ అయిపోతుంది. నాగబాబు కుమార్తె నిహారిక ఒక మనసు సినిమా ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంది గానీ హిట్ అందుకోలేకపోయింది. సో బాగా అప్ సెట్ అయిపోయింది. దాదాపు ఏడాదిదాకా ఏ సినిమాకి సంతకం చేయలేదు. అంతలా డీలా పడిపోయింది. ఇక నటిగా వెనకడుగు వేసిందేమోనని అందరూ అనుకున్నారు. కానీ తమిళంలోకి అడుగు పెట్టింది. ఆర్ముగకుమార్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌” చిత్రంతో కోలీవుడ్ లో ప్రవేశించింది. ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ గేర్ మార్చింది.

ఇప్పటికే సుమంత్ అశ్విన్ తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాను కంప్లీట్ చేసింది. ఇది రిలీజ్ కాకముందే ఆమె ఇంకో రెండు కొత్త చిత్రాలకు సైన్ చేసింది. కొత్త లేడీ డైరక్టర్ సుజనా దర్శకత్వంలో నటించనుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఇందులో శ్రియాతో కలిసి నిహారిక స్క్రీన్ చేసుకోనుంది. అలాగే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతునున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న మొదటి చిత్రంలో కూడ నిహారిక హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని దర్శకురాలు ప్రణిత బ్రమండపల్లి డైరెక్ట్ చేయనుండగా రాహుల్ విజయ్ హీరోగా నటించనున్నాడు. మెగా హీరోలు చిరుతో సహా అందరూ ఒకే సినిమాకి కమిట్ అయ్యారు. వరుణ్ తేజ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. నిహారిక మాత్రం ఒకే సారి మూడు సినిమాలకు ఒకే చెప్పి దూసుకుపోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus