Niharika: బంగారం ఎవరు నిహారిక.. ఏం చెప్పాలనుకుంటున్నావ్?

  • April 20, 2023 / 06:34 PM IST

నిహారిక కొణిదేల పరిచయం అవసరం లేని పేరు గత కొద్ది రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అందుకు గల కారణం తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బయటకు రావడమే అని చెప్పాలి.నిహారిక గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే ఈమె తన భర్తతో విడాకులు తీసుకోబోతుందనే వార్తలు వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నిహారిక గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇలా ఒకవైపు విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్న మరోవైపు ఈమె ఫోటోషూట్ లో చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే నిహారిక తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఈ వీడియో పలు అనుమానాలకు కారణం అవుతుంది. ఈ వీడియో కనుక చూస్తే జిమ్ చేసి నిహారిక అలసిపోయారని అర్థమవుతుంది. ఈ వీడియోని షేర్ చేసిన నిహారిక ‘ఐ యామ్ డెత్డ్ బంగారం’ అని కామెంట్ పెట్టారు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిహారిక (Niharika) ఎవరిని బంగారం అని ఉద్దేశిస్తూ ఈ వీడియో షేర్ చేశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిహారిక ప్రేమ కురిపించిన ఆ డియర్ ఫెలో ఎవరనేది ఇక్కడ ప్రశ్న.ఇలా సోషల్ మీడియా ద్వారా ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నటువంటి ఈమె అభిమానులకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య ఇద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నప్పటికీ మెగా కుటుంబం ఈ విషయంపై చాలా మౌనం వహిస్తున్నారు. ఇక నాగబాబు తన కుమార్తె గురించి అస్సలు మాట్లాడటం లేదు.ఇలా తన గురించి విడాకులు వార్తలు వస్తున్న తరుణంలో ఈమె బంగారం అంటూ ఇలాంటి పోస్టులు చేయడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిహారిక షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus